హీరో నిఖిల్ నిశ్చితార్థం... అమ్మాయెవరో చూడండి!

  • ఓ లేడీ డాక్టర్ ను పెళ్లాడబోతున్న నిఖిల్
  • ఇటీవలే ప్రపోజ్ చేసిన హీరో
  • ఏప్రిల్ 16న పెళ్లి!
ఇటీవలే అర్జున్ సురవరం చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఏప్రిల్ 16న నిఖిల్ వివాహం జరగనుంది. ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు హాజరైన ఓ కార్యక్రమంలో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. ఇక, గోవాలోని ఓ ఐలాండ్ రిసార్ట్ వద్ద తన కాబోయే భాగస్వామికి నిఖిల్ ప్రపోజ్ చేశాడు. నిఖిల్ పెళ్లాడబోయే అమ్మాయి ఓ డాక్టర్. ఆమె పేరు పల్లవి వర్మ. ఏపీలోని భీమవరం ఆమె స్వస్థలం. గత కొంతకాలం నుంచి నిఖిల్, పల్లవి ప్రేమలో ఉన్నట్టు సమాచారం. పెళ్లి గురించి వార్తలు వస్తున్నా, నిఖిల్ వాటిపై పెదవి విప్పకపోవడంతో ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఫొటోలు కూడా రావడంతో నిఖిల్ పెళ్లిపై క్లారిటీ వచ్చింది.
Go Back to Shorts
Nikhil
Wedding
Engagement
Dr.Pallavi Varma
Tollywood

More Telugu News